Wednesday 25 March 2015

అమ్మాయిలు....ఎందుకిలా?.......

మనిషి చుట్టూ వుండే పరిస్థితులకి చాలా ప్రభావితం చెందుతున్నడనేది వాస్తవం. అమ్మయిల విషయంలో ఇది  అక్షరసత్యం. ఎలాంటి వాతావరణంలో అయిన సులభంగా మారిపోతుంది ఆడది. తన చుట్టూ వుండే విశ్వమంతా ప్రపంచంలో తనకొక చిన్న ప్రపంచం ఏర్పరుచుకొని తనని తాను రాణిగా ప్రకంటిన్చుకోగల సమర్ధురాలు తను. మానసికంగా అబ్బాయిలకంటే మేమే బలవంతులం. విషయంలో అనవసరంగా వాదించి టైం వృథా చేసుకోలేం. సాధారణ తెలివితేటలున్న అమ్మాయి కూడా తెలివైన అబ్బాయిని అంచనా వేయడంలో పొరబడదు. అదే చాలా తెలివి తేటలున్న అబ్బాయి అమాయకమైన అమ్మాయి మనసును అర్థం చేసుకోవడంలో కూడా బోర్లా పడతారు. అబ్బయిలను నమ్మి అమ్మయిలు మోసపోతున్నారనేది నిన్నటి ఉదంతం. కానీ ఒక అమ్మయిని నమ్మిన  అబ్బాయి జీవితం మొత్తం అమ్మయిని తలచుకొని బాధపడతడనేది నేడు తెలుసుకోవాల్సిన ఆధునిక  సత్యం. అది అమ్మయిల తప్పు కాదు ముమ్మాటికి అబ్బాయిలదే. అమ్మయిలు అందరిని ఒకే భావనతో  చూడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇస్తాపడినప్పుడు అమ్మాయిని అందరితో సమానంగా చూడలేడు. తనకి ఒక ప్రత్యేక స్థానం ఇస్తాడు. అలాంటి ప్రేమనే అమ్మాయి దగ్గర నుండి కోరుకుంటాడు. కానీ అది అమ్మాయిల దగ్గరనుండి ఆశించడం నేరం అని  అబ్బాయితోనే చెప్పించగల సమర్ధులు అమ్మాయిలు. అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల దగ్గరనుండి నిజాలనే వినాలనుకుంటారు. కాని అబద్దానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. చివరికి నిజాయితిగా వుండే  అబ్బాయిమీద చులకన భావం ఏర్పడి దూరం పెడుతున్నారు. అదేంటి అని అబ్బాయి ప్రశ్నిస్తే నీ మంచి  కోసమే దూరం పెడుతున్న అని చెప్పగల నేర్పరి అమ్మాయి. నువ్వు పక్కన వుంటే ఏమైనా సాధిస్తా అని  చెప్పిన అబ్బాయిలని వదిలేసి అన్ని సాధించిన అబ్బాయిలతో వివాహం చేసుకొని తమ జీవితాన్ని రంగులమయంగా చేసుకొని అబ్బయిల జీవితాన్ని చీకటిలో పడవేస్తారు. అమ్మాయిలదగ్గర వున్న గొప్ప ఆయుధం "మౌనం". అది అబ్బయిల దగ్గర అస్సలు ఉండదు. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకుంటే  బంధం బలపడుతుంది. కాని సమస్యని అమ్మాయిలు తమ మౌనంతో పెద్దది చేసి ఏమి తెలియనట్టు  మిన్నకున్డిపోతారు. సరే సమస్యని ఎందుకు జటిలం చేయడం అని నచ్చచెప్పాలని చూస్తే లేనిపోని ఆలోచనలు ఎందుకు తీసుకోస్తున్నవని తిరిగి అబ్బాయిలనే ప్రశ్నిస్తారుఅస్సలు మీకు ఏం కావాలి?...అంటే Ntg bye అని simplega చెప్పి వెళ్ళిపోతారు. ఏంటో అమ్మయిలు .... ఎంతో ప్రేమిస్తున్నాం అని చెప్తారునీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అని చెప్పే అమ్మాయిలు  మరి ఎందుకు మౌనంగా వుంటారో దేవుడికే తెలియాలి. అబ్బాయిలు ఏమన్నాతప్పు చేస్తే అస్సలు  క్షమించరు కాని వాళ్ళు చేసిన తపుల్ని ఒప్పుకొని నేను నిన్ను మోసం చేశాను నన్ను మర్చిపో అని  చెప్తారు. అస్సలు మోసం చేయడం ఎందుకు ....తర్వతా మళ్ళి మర్చిపో అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం ఎందుకు....
                              నిజంగా అబ్బాయిని ప్రేమిస్తే మోసం ఎలా చేయాలనిపిస్తుంది. సరే తెలియకుండా చేసింది అని అబ్బాయి  క్షమించిన కూడా మళ్ళి ఇంకో తప్పు చేయడానికి రెడీ అవుతారు. లేని ప్రేమని చూపించి మిమ్మల్ని పట్టించుకోకుండా వున్న అబ్బాయిలవైపు పరుగులు తీస్తారు. మరి మిమ్మల్నే కావాలని తమ జీవితాల్ని  మీకోసం త్యాగం చేసిన అబ్బాయిలంటే ఎందుకు మీకు అంత చులకన.

                                         మనసులో చాలా ప్రేమ వుంది అని చెప్పే మీరు అది చూపించకుండా ఎందుకు దోబుచులడతారు. నిజంగా చెప్పాలంటే ప్రేమ వుందో లేదో తెలియని అమాయకత్వం అమ్మాయిలది. కాని ఆ అమాయకత్వాన్ని మౌనంతో  సమాధి చేసేస్తారు. ప్రేమ వుంటే చూపించండి లేదా ప్రేమ లేదు అని చెప్పేయండి. అమ్మయిల దగ్గర  ప్రేమకంటే  క్లారిటినే ఎక్కువగా అబ్బాయిలు కోరుకుంటున్నారు. ప్రేమని చూపించలేకపోయిన కనీసం క్లారిటీ అయిన  ఇవ్వండి. ఇన్నిమాటలు చెప్తే చివరికి అమ్మాయి చెప్పే ఒకే ఒక్క మాట నిన్నుబాధపెట్టడం ఇష్టంలేదు అందుకే నీ నుండి దూరంగా ఉంటున్నఅని. నిజంగా అంతగా బాధ పెట్టడం ఇష్టంలేని వాళ్ళు దూరంగా వుండటం దేనికి ? ….ఆలోచించు.........కోండి!!!

No comments:

Post a Comment