Wednesday 11 March 2015

ప్రేమ-భయం

ప్రేమ వున్నచోట భయం ఉండదు భయం వున్నచోట ప్రేమ ఉండదు అంటారు. ఇది ఒక సినిమాలోని డైలాగ్. కానీ నాకెందుకో రెండింటికి చాలా దగ్గర సంబంధం వుంటుంది అనిపిస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తి సంతోషంగా వుండాలని కోరుకుంటాం. మన వల్ల ఎటువంటి ఆపద రాకూడదు అని జాగ్రత్త పడతాం. అందుకే మనం ప్రేమించిన వ్యక్తికి ఏం జరుగుతుందో అని భయపడి మన ప్రేమనైన వదులుకుంటాం కానీ భయాన్ని మాత్రం ప్రేమిస్తాం. చిత్రం కదూ!!.... ప్రేమించిన మనిషిని వదులుకునేంత భయం వుంటుంది కాని ప్రేమ మాత్రం ఉండదు. ప్రేమ హృదయంలో వుంటుంది అంటారు కాని భయం మాత్రం మనిషి శరీరం నిండా ఆవరించి వుంటుంది. అందుకే భయాన్ని చూసి ప్రేమ కూడా భయపడుతుంది. అలా అని భయపడేవారిది నిజమైన ప్రేమ కాదు అనలేం కాకపోతే వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కంటే కూడా భయాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే భయాన్ని వదులుకోలేరు.
                                  అసలు నిజమైన ప్రేమంటే అర్ధం ఏంటి? భయం లేకపోవడమా? లేదా దైర్యంగా వుండటమా? ...ఏమో!..కాని నాకు తెలిసినంతవరకు నిజమైన ప్రేమ తప్పులని క్షమిస్తుంది. అందుకే నిజంగా ప్రేమించిన వారు అవతలివారి తప్పులని క్షమించి తాము బాధని అనుభవిస్తారు. తప్పు ఒకరిది!..శిక్ష మరొకరిది!!...
          ""తిట్టెంత కోపం వున్నా తిట్టలేకపోవడం ప్రేమ!
           అనుమానించే అవకాశం వున్నా నమ్మడమే ప్రేమ!!
           విడిపోవడానికి వంద కారణాలు వున్నా చివరి వరకు కలిసివుండటమే నిజమైన ప్రేమ!!!""
నిజమైన ప్రేమకి దూరం అనేది ఉండదు. విడిపోవడం అనేది ఉండదు. కాబట్టి నీ ఆనందం కోసమే నేను దూరంగా ఉంటున్న అనే అపోహలో మాత్రం ప్రేమించకండి. అది ప్రేమ అనిపించుకోదు.
      చివరిగా ఒకటి...మనిషిని ప్రేమించండి...భయాన్ని కాదు.....!!!

No comments:

Post a Comment