Monday 9 March 2015

ప్రేమ-దానం ...స్వార్ధం-నిజాయితి

ప్రేమకి, స్వార్ధానికి చాలా సారూప్యం వుందని పెద్దలు చెబుతారు. కానీ నా దృష్టిలో ప్రేమ కంటే స్వార్ధమే నయం. ప్రేమలో నిజాయితి వుంటుంది అంటారు కదా అసలు నిజాయితి అంటే ఏమిటి? కాస్త లోతుగా ఆలోచిస్తే స్వార్ధాన్నే నిజాయితి అనుకోవచ్చు. ఎందుకంటే ఆశించడాన్నే స్వార్ధం అంటారు కదా! మనం అంగడిలో డబ్బులిచ్చి వస్తువులని కొనుక్కుంటాం. అలానే మనం ఇతరులకి మన ప్రేమని ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ప్రేమని ఆశిస్తాం. మనం నిక్కచ్చిగా డబ్బులిచ్చి దానికి తగినంత వస్తువులని కొనుక్కుంటాం. ఇక్కడ పని నిజాయితిగా జరుగుతుంది. అలానే స్వార్ధం కూడా. మనం ఇతరులకి సహాయం చేసి వారి దగ్గర నుండి సహాయాన్ని ఆశిస్తాం. ఇక్కడ కూడా నిజాయితి వుంది. ఎందుకంటే మనం సహాయం చేయకుండా అవతలి వారినుండి ప్రతిఫలం ఆశించం కదా! స్వార్ధం కూడా అంతే. ప్రతి మనిషి తన స్వార్ధం కోసం తన సుఖాన్ని తను చూసుకుంటాడు. ఎవరి స్వార్ధం వాళ్ళకి నిజయితిగానే అనిపిస్తుంది. అందుకే లోతుగా ఆలోచిస్తే స్వార్ధాన్ని కూడా నిజాయితి అనుకోవచ్చు. అందుకే ఈ లోకంలో స్వార్ధమనే నిజాయితి పెరిగిపోతుంది. ప్రేమంటే ఇతరులకి ఇవ్వాలని ఆసిన్చాకుడదని అంటారు. అందుకే ప్రేమ ఎక్కడా సఫలం అవ్వట్లేదు. చివరికి ప్రేమికులకి వేదన మాత్రమే మిగులుతుంది. డబ్బులివ్వకుండా అంగడిలో వస్తువాలని ఇస్తారా? ఉచితంగా ఇస్తే దానం అంటారు మరి ప్రేమని కూడా దానం అనే అందామా? అందుకే ప్రేమంటే దానం. స్వార్ధమంటే నిజాయితి. దానం చేయడం ఎంత ముఖ్యమో అది ఎవరికి చేస్తున్నామో కూడా అంతే ముఖ్యo. అర్హులకి మాత్రమే దానం చేయాలి. ప్రేమని కూడా అంతే. అర్హత ఉన్నవారికే ప్రేమని పంచాలి. లేకపోతే అది వ్యర్ధం అవుతుంది. అర్హత లేని వారికి ప్రేమని ఇస్తే వారు దానిని అవసరంగా వాడుకుంటారు. అతిగా ప్రేమించడం అనేది బలహీనతో లేదా గొప్ప ప్రేమో తెలియని సంశయంలో చాలామంది వున్నారు. అది బలహీనత కాదు అలా అని గొప్ప ప్రేమ కూడా కాదు. అర్హత లేని వాళ్ళని ప్రేమించడం ద్వార వచ్చే పాపం అది.....ప్రేమించండి కానీ అర్హత ఉన్నవారినే ప్రేమించండి. లేనివారిని ప్రేమించి మీ అర్హతని కోల్పోకండి . చివరిగా ప్రేమని అవసరంగా వాడుకునే వాళ్ళు ఆనందంగా వుంటున్నారు ప్రేమించినవాళ్లు బాధని ఆశ్రయిస్తున్నారు.

No comments:

Post a Comment